అక్షరటుడే, ఇందూరు: ఎన్నికల హామీలో భాగంగా కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు పరచాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం నిజామాబాద్ ఉత్తర, దక్షిణ మండలాల తహశీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. ప్రతి సంవత్సరం బీసీలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరు నాగరాజు, అర్బన్ అసెంబ్లీ కన్వీనర్ గిరిబాబు, కార్పొరేటర్ మెట్టు విజయ్, మండల అధ్యక్షుడు సురేష్, నరేష్, మారుతి, రాజ్కుమార్, గడ్డం రాజు, ముత్యాలు, రంజిత్, గణేష్ పాల్గొన్నారు.