అక్షరటుడే, వెబ్‌డెస్క్: తెలంగాణ, బాంబే హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీకి సుప్రీం కోర్టు కొలీజీయం సిఫారసు చేసింది. రాష్ట్ర హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు, బాంబే హైకోర్టు సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. 2023 జూలైలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాధే నియమితులైన విషయం తెలిసిందే.