అక్షరటుడే, ఆర్మూర్: మాక్లూర్ సొసైటీని (మాక్లూర్, కల్లెడి, గొట్టుముక్కల, చిక్లీ) నాలుగు సంఘాలుగా విభజించాలని కార్యవర్గ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వినయ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. దీంతో వినయ్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షులు గుండారం శేఖర్, సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు.