అక్షరటుడే, కామారెడ్డి: వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. బుధవారం రాజంపేట మండలం బస్వన్నపల్లిలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులు, గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తమ కుటుంబ సభ్యులను చైతన్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ అఫ్రోజుద్దీన్, మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.