అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న డాక్టర్‌ యోగితా రాణాకు విద్యా శాఖ కార్యదర్శిగా, అక్కడ కొనసాగుతున్న శ్రీధర్‌ను మైన్స్‌ అండ్‌ జియాలజీ సెక్రెటరీగా నియమించారు. అలాగే సురేంద్ర మోహన్‌ను రవాణా శాఖ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.