అక్షరటుడే, వెబ్డెస్క్: రోడ్డుపై పడి ఉన్న పసికందు మృదేహాన్ని కుక్కలు ఈడ్చుకెళ్లాయి. ఈ ఘటన రెంజల్ మండలం బోర్గాం గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. చిన్నారి మృతదేహాన్ని కుక్కలు ఈడ్చుకు వెళ్తుండగా గ్రామస్తులు గమనించి వాటిని తరిమేశారు. అప్పుడే పుట్టిన శిశువు చనిపోవడంతో పడేసినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.