అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ పర్యటనలో భాగంగా వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి గురువారం కలెక్టరేట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డితో పాటు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డి, రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్‌కు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ నర్సయ్య, ఎన్ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వేణు రాజ్ తదితరులు పాల్గొన్నారు.