అక్షరటుడే, వెబ్డెస్క్: మానవుని భవిష్యత్తు యుద్ధంలో లేదని.. బుద్ధుడిలో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. గురువారం ఒడిశాలోని భువనేశ్వర్లో జరుగుతున్న 18వ ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఒడిశా నుంచి వ్యాపారులు సుమత్రా, బాలి, జావా వంటి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసేవారని గుర్తు చేశారు. ‘భారత్ కేవలం యువ దేశమే కాదు. నిపుణులైన యువకుల దేశం. భారత్కు విశ్వబంధుగా గుర్తింపు ఉంది. దానిని మరింత బలోపేతం చేయాలి’ అని ప్రధాని మోదీ ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి జైశంకర్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.