అక్షరటుడే, కామారెడ్డి: జిల్లాలో చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సింధుశర్మ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా టాస్క్ఫోర్సు దాడులు కొనసాగుతున్నాయని, ఇప్పటికే 65 బెండల చైనా మాంజా స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశామన్నారు. ఈ దారం ఉపయోగించి గాలిపటాలు ఎగురవేసే క్రమంలో పక్షులు, ప్రజలు ప్రమాదానికి గురవుతారని తెలిపారు. చైనా మాంజా అమ్మితే ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా పడే అవకాశం ఉందన్నారు. మాంజాల విక్రయంపై 8712686112 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.