అక్షరటుడే, కోటగిరి: పోతంగల్ శివారులోని స్థానిక మంజీర పరివాహక ప్రాంతంలో ఎలాంటి అనుమతి లేకుండా నిల్వ చేసిన 100 ట్రాక్టర్ల ఇసుక డంపులను శుక్రవారం రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ విషయాన్ని ఇన్‌ఛార్జి తహశీల్దార్ సురేందర్ నాయక్ బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహతోకు తెలిపారు. ఈ ఇసుకను ప్రభుత్వ పనుల కోసం, డీడీలు కట్టి అనుమతి పొందిన వారికే కేటాయించాలని సబ్ కలెక్టర్ ఆదేశించినట్లు ఇన్‌ఛార్జి తహశీల్దార్ తెలిపారు.