అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: యూకేను మంచు దుప్పటి కప్పేసింది. అత్యంత శీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత 15 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. నేడు -20C వరకు తగ్గే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇంగ్లాండ్, స్కాట్లాండ్ యొక్క తూర్పు తీరం, నైరుతి, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో పసుపు హెచ్చరికలు కొనసాగుతున్నాయి.