అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌-విజయవాడ హైవేపై ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు మొదలయ్యాయి. దీంతో హైదరాబాద్ నుంచి ప్రజలు సొంతూరి బాట పట్టారు. వేలాది కార్లు ఒకేసారి రోడ్డెక్కడంతో విజయవాడ హైవేపై వాహనాల జాతర కొనసాగుతోంది. రద్దీ వల్ల నెమ్మదిగా ప్రయాణం సాగుతోంది. గంటలకు 30-40 కి.మీ. వేగాన్ని మించి వెళ్లలేని పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల బంపర్‌ టు బంపర్‌ ట్రాఫిక్‌ ఉంది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.