అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌ ఎమ్మెల్యే గురుప్రీత్‌ గోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి బుల్లెట్‌ గాయాలతో పడి ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా ప్రమాదవశాత్తు ఎమెల్యే పిస్టోల్‌ పేలడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తలలో రెండు బుల్లెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.