అక్షరటుడే, వెబ్డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. తర్వాత స్వల్పంగా పుంజుకున్నాయి. ఉదయం 10:20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 408 పాయింట్లు నష్టపోయి 76,970 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 142 పాయింట్ల నష్టంతో 23,288 వద్ద కదలాడుతోంది.