అక్షరటుడే, వెబ్‌డెస్క్: నిజామాబాద్ కమిషనరేట్‌లోని భీమ్‌గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్‌పై బదిలీ వేటు పడింది. సర్కిల్ బాధ్యతల నుంచి తప్పిస్తూ.. ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సర్కిల్ పరిధిలో జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అలాగే భీమ్‌గల్ ఎస్సై మహేష్ ను సైతం పోస్టింగ్ నుంచి తప్పించే అవకాశాలున్నాయి.