అక్షరటుడే, వెబ్డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈఏపీ సెట్ అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి ఏప్రిల్ 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈఏపీ సెట్ ఇంజినీరింగ్ ఎగ్జామ్స్ మే 2 నుంచి 5 వరకు జరపనున్నట్లు తెలిపింది. మే 12న ఈసెట్, జూన్ 1న ఎడ్సెట్ జరుగుతాయని చెప్పింది. జూన్ 16న లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు, జూన్ 8, 9వ తేదీల్లో ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈ సెట్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.