అక్షరటుడే, ఎల్లారెడ్డి: యువత క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని మున్సిపాల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. మండలంలోని కురుమ సాయిబాబా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి 36 టీంలు పోటీల్లో పాల్గొన్నాయి. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తామని నిర్వాహకుడు సాయిబాబా తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.