అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండల ప్రజలు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉపాధి, ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు సొంతూళ్లకు రావడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. యువకులు, పిల్లలు గాలి పటాలు ఎగురవేస్తూ ఉత్సాహంగా గడిపారు. యువకులు క్రికెట్, కబడ్డీ క్రీడల్లో మునిగితేలారు.