అక్షరటుడే, బిచ్కుంద: ఎదురెదురుగా బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఎస్సై విజయ్ కొండ కథనం ప్రకారం.. మద్నూర్ మండలం సోనాల రోడ్డుపై బుధవారం ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో గోజేగావ్‌కు చెందిన లక్ష్మణ్ దేశాయ్(39) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.