అక్షరటుడే, భీమ్‌గల్‌: కమిషనరేట్‌లోని భీమ్‌గల్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ గా పొన్నం సత్యనారాయణ గౌడ్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. రామగుండం కమిషనరేట్‌లో పనిచేస్తున్న సత్యనారాయణను ఇక్కడికి బదిలీ చేశారు. ఈ మేరకు మల్టీజోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు భీమ్‌గల్‌ సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌గా పని చేసిన నవీన్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే.