అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు సంబంధించిన 23 మడిగెలకు డిసెంబర్ 31తో టెండర్ పూర్తవడంతో ఆర్టీసీ అధికారులు నోటీసులిచ్చారు. అయినా దుకాణాలు ఖాళీ చేయకపోవడంతో శనివారం ఆర్టీసీ సిబ్బంది ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దుకాణదారులు డీఎస్పీ సత్యనారాయణను ఆశ్రయించి వారం రోజులు గడువు కోరారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చి వారం రోజుల తర్వాత ఖాళీ చేయిస్తామని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు.