అక్షరటుడే, వెబ్డెస్క్: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా వంటి పరిస్థితుల్లో శుభ్రత ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందన్నారు. గుంటూరు జిల్లా నంబూర్లో శనివారం స్వచ్ఛ ఏపీ- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా పారిశుధ్య కార్మికులను ఆయన సన్మానించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో పవన్ కళ్యాణ్ మొక్కలు నాటారు. పారిశుధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించి, ట్రాక్టర్ను స్వయంగా నడిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర-2047లో పరిశుభ్రత ఎంతో కీలకమన్నారు. భవిష్యత్ తరాలకు ఈ కార్యక్రమం ప్రేరణ కావాలని సూచించారు.