అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: మహాకుంభమేళాలో బీజేపీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో ఎంపీ అర్వింద్ చిత్రపటానికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సెల్ కన్వీనర్ నవీన్ మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ జిల్లాకు పసుపు బోర్డును తీసుకొచ్చి పసుపు పండించే రైతన్నల కుటుంబాల్లో వెలుగును తీసుకొచ్చారన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌కు, జాతీయ పసుపు బోర్డు అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి చిత్రపటాలకు జలాభిషేకం చేశామన్నారు. కార్యక్రమంలో ద్యాగ ప్రశాంత్, క్రాంతి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.