అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: నూతన రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నగరంలో వార్డు సభలను మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం మున్సిపల్‌ అధికారులు వెల్లడించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు కార్పొరేషన్‌లోని 60 వార్డుల్లో సభలు జరగనున్నాయి. దీని కోసం అధికారులు 8 బృందాలను ఏర్పాటు చేశారు.