అక్షరటుడే, నిజాంసాగర్‌: పెద్ద కొడప్‌గల్‌ మండలం కాటేపల్లిలో నిర్వహించిన కాటేపల్లి క్రికెట్ ప్రీమియర్‌ లీగ్‌ ఉత్సాహంగా సాగింది. 12 రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో వివిధ గ్రామాల నుంచి 52 జట్లు పాల్గొన్నాయి. పోటీల్లో సంగోజీపేట్‌ జట్టు మొదటిస్థానంలో నిలిచి రూ.22,222 ప్రైజ్‌మనీ గెలుచుకుంది. అలాగే కాటేపల్లి జట్టు రెండోస్థానంలో నిలిచి రూ.11,111 ప్రైజ్‌ మనీ అందుకుంది. మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా బర్ధావల్‌ కిషన్‌ నిలిచాడు. క్రీడాకారులకు మల్లప్ప పటేల్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ స్నాక్స్‌ అందించగా.. పనుగంటి బస్వరాజ్‌ తాగునీటి వసతి కల్పించారు. రామాగౌడ్‌ ఆటగాళ్లకు జెర్సీలు సమకూర్చారు.