అక్షరటుడే, ఇందూరు: గత మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే కళాశాలను నడపలేమని ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బకాయిలు పెండింగ్లో ఉండడంతో సిబ్బంది జీతాలు, భవనాల అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కలెక్టర్ ను కలిసిన వారిలో సంజీవ్, నరాల సుధాకర్, సూర్య ప్రకాష్, శ్రీనివాస్, అరుణ్, రమణ, నవీన్, షేక్ రషీద్, రవి పటేల్, గంగాధర్ తదితరులున్నారు.