హైదరాబాద్, అక్షరటుడే: హైదరాబాద్‌లో ఐటీ అధికారుల దూకుడు కొనసాగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు చేపడుతున్నారు. మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లు, ఆఫీసుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప-2 సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది. మరోవైపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నిర్మాత దిల్ రాజు ఇంట్లో సైతం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సింగర్ సునీత భర్త రాముకు సంబంధించిన మ్యాంగో సంస్థపైనా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాముల ఇళ్లలో సోదాలు చేపట్టారు.