అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని మూడో వార్డు కమ్యూనిటీ హాల్ వద్ద మంగళవారం నిర్వహించిన వార్డు సభలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. వార్డు సభ ఫ్లెక్సీలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఫొటో లేకపోవడంపై బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్ అభ్యంతరం తెలిపారు. అక్కడే ఉన్న మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు.