అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట్ మండలం ఎక్కపల్లి మాజీ ఎంపీటీసీ విఠల్ తండ్రి, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు మామయ్య ఇటీవల మృతి చెందారు. దీంతో మంగళవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వారి కుటుంబీకులను పరామర్శించారు. ఆయన వెంట దివిటి రమేష్, కవిత నర్సింలు, మాజీ ఎంపీటీసీలు గన్ను నాయక్, విఠల్, రూప్ సింగ్, తదితరులున్నారు.