అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ లో పట్టుబడిన ఓ వ్యక్తికి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు రెండో టౌన్ ఎస్సై యాసిర్ అరాఫత్ తెలిపారు. అలాగే మరో ముగ్గురికి రూ.2వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 14న ముబారక్ నగర్ లో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన మరో వ్యక్తికి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు నిజామాబాద్ రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు.