నిజాంసాగర్, అక్షరటుడే: అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని, జాబితాలో పేరు లేదని ఎవరూ ఆందోళన చెందవద్దని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. నిజాంసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో మాట్లాడారు. రేషన్ కార్డులు రానివారు దరఖాస్తు చేసుకోవాలని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డులను అందజేస్తామని చెప్పారు. మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్, పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, నాయకులు ప్రతాపరెడ్డి, తహసిల్దార్ భిక్షపతి, ఎంపీడీవో గంగాధర్, గ్రామ ప్రత్యేకాధికారి యూనివర్స్, పంచాయతీ కార్యదర్శి గంగాసాగర్, ప్రజలు పాల్గొన్నారు.