అక్షరటుడే, హైదరాబాద్: టాలీవుడ్ లో జరుగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. రెండో రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థల కార్యాలయాలు, నిర్మాతల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా డైరెక్టర్ సుకుమార్‌ ఇంట్లోనూ ఐటీ సోదాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. పలువురు ఫైనాన్షియర్స్ పైనా రెయిడ్స్ కొనసాగుతున్నాయి. అయితే గతంలో 2023లోనూ సుకుమార్​ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి.