అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కార్డుల పంపిణీ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం మాదిరిగా తినలేకుండా ఉండే దొడ్డు బియ్యం కాకుండా.. మంచి క్వాలిటీ ఉండే సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు.