అక్షరటుడే, వెబ్‌డెస్క్ : హనుమకొండలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై పట్టపగలు ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని సుబేదారి పీఎస్ పరిధిలోని డీమార్ట్ ఎదురుగా అందరూ చూస్తుండగానే ఈఘటన జరిగింది. మడికొండకు చెందిన ఆటోడ్రైవర్లు రాజ్‌కుమమార్, వెంకటేశ్వర్లు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈదాడిలో రాజ్‌కుమార్ మృతి చెందాడు. సుబేదారి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.