అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : ఎడపల్లి మండలం జానకంపేటలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. రూ.1.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. మొదట షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించినట్లు భావించినా గ్యాస్ లీకేజీతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.