అక్షరటుడే, వెబ్‌డెస్క్: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కారు డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేయడంతో ఎనిమిది కార్లు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటన సూర్యాపేట గరిడేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మంత్రి హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ దర్గాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మూడు కార్లు ధ్వంసమయ్యాయి.