అక్షరటుడే, వెబ్​డెస్క్​: పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. కొద్దిరోజులుగా బంగారం ధరలు పరుగులు పెడుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మాఘ మాసంలో వివాహాలు ఉండడంతో పుత్తడి కొనుగోలు చేయాలనుకుంటున్న వారిని పెరుగుతున్న రేట్లు కలవరపెడుతున్నాయి. శుక్రవారం హైదరాబాద్​ మార్కెట్​లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరిగి రూ.82,420కి చేరింది. 22 క్యారెట్ల ధర రూ.300 పెరిగి రూ.75,550 పలుకుతోంది. వెండి కేజీ రూ.వెయ్యి పెరిగి రూ.1,05,000గా ఉంది.