అక్షరటుడే, కామారెడ్డి: గోడకు రంధ్రం చేసి సూపర్ మార్కెట్లో చోరీ చేసిన ఘటన కామారెడ్డి పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద అశోక్ నగర్ వెళ్లే దారిలో గల విజయ సూపర్ మార్కెట్లో చోరీ జరిగింది. నిందితుడు గోడకు రంధ్రం చేసి అందులోని నుంచి లోనికి చొరబడ్డాడు. రూ.33 వేల నగదు, ఇన్వర్టర్, డబ్బాలు, ఇతర సామగ్రి ఎత్తుకెళ్లాడు. ఉదయం గమనించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పట్టణ సీఐ చంద్రశేఖర్రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.