అక్షరటుడే, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో క్యాన్సర్ ఆస్పత్రికి సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడే నిద్రిస్తున్న ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారకులైన వారు కారును వదిలిపెట్టి పారిపోయారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.