అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఐటీ సోదాలపై ప్రముఖ నిర్మాత దిల్​రాజ్​ స్పందించారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇలాంటి తనిఖీలు సాధారణమన్నారు. ఐటీ అధికారులు అకౌంట్లు చూసి, స్టేట్​మెంట్లు తీసుకున్నారని ఆయన చెప్పారు. తమ అకౌంట్లు క్లియర్‌గా ఉన్నాయని, డబ్బులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఫిబ్రవరి 3న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.