అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని సంగమేశ్వర్ కాలనీలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కాలనీవాసులు సోమవారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. కాలనీ ఏర్పడి 25 ఏళ్లు అవుతుందని, 1500 కుటుంబాలు నివసిస్తున్నాయని పేర్కొన్నారు. రేషన్ దుకాణం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో యూనుస్, మతిన్, వాసిఫ్, ఇలియాస్, బాసిత్, మధు, రాజు తదితరులు పాల్గొన్నారు.