అక్షరటుడే, వెబ్​డెస్క్​: రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. ఈ పథకం కింద సీజన్​కు ఎకరాకు రూ.6వేలు అందించనున్న విషయం తెలిసిందే. కాగా.. ఎంపిక చేసిన 606 గ్రామాల్లోని రైతులకు ప్రభుత్వం రైతు భరోసా జమ చేస్తోంది. దీని కోసం రూ.570 కోట్లు విడుదల చేసింది.