అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: బతుకు దెరువు కోసం ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. స్కూటీపై కిరాణ సామగ్రి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. నగరంలోని ధర్మపురి హిల్స్​కు చెందిన సిద్దిక్​ చిన్న చిన్న పనులు చేసేవాడు. వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో స్కూటీపై కిరాణ సామగ్రి విక్రయించడం మొదలు పెట్టాడు. డ్రై ఫ్రూట్స్​, మసాలలు, పప్పు దినుసులు, ఇతర సామగ్రి విక్రయిస్తున్నాడు. నగరంలో గల్లీ గల్లీ తిరుగతూ అమ్ముతానని సిద్దిక్​ తెలిపాడు.