అక్షరటుడే, నిజాంసాగర్: నిజాంసాగర్ మండల కేంద్రంలోని నర్సింగ్రావుపల్లిలో బడి మానేసిన ముగ్గురు పిల్లలను సోమవారం గుర్తించినట్లు సీఆర్పీ శ్రీధర్ తెలిపారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను బడిలో చేర్పించామన్నారు. 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలను బడికి పంపాలని ఆయన సూచించారు. పాఠశాల హెచ్ఎం దేవీసింగ్ పాల్గొన్నారు.