అక్షరటుడే, ఇందూరు: ప్రజావాణిలో నమోదైన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్​ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 225 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను అర్జీదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ సంకేత్, డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్​లు ఫిర్యాదులు స్వీకరించారు.