డబ్బులు పంచుతూ పట్టుబడ్డ కాంగ్రెస్ నేత

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: నగరంలోని వినాయక్ నగర్ వంద ఫీట్ల రోడ్డులో కాంగ్రెస్ నేత డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో నాలుగో టౌన్ పోలీసులు దాడి జరిపారు. మాజీ మేయర్ భర్త ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం అతని వద్ద నగదు సీజ్ చేశారు. అయితే పోలీసులు వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. మరోవైపు చంద్రశేఖర్ కాలనీలోనూ కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతుండగా పోలీసులకు సమాచారం అందింది. అక్కడున్న వారిని పోలీసులు చెదరగొట్టారు. అయిదో టౌన్ పరిధిలోనూ ఒకరిని పట్టుకున్నట్లు సమాచారం.