అక్షరటుడే, ఇందూరు: ఉత్తమ ఫీచర్లు.. అత్యుత్తమ మైలేజీతో నూతన డెస్టినీ 125 స్కూటర్‌ను రూపొందించడం అభినందనీయమని నూడా చైర్మన్ కేశ వేణు అన్నారు. గురువారం నగరంలోని వినాయక నగర్లో ఉన్న వెంకటేశ్వర హీరో షోరూంలో స్కూటర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు, వృద్ధులు సులభతరంగా నడిపేలా రూపొందించారన్నారు. కార్యక్రమంలో యజమాని మహిపాల్ రెడ్డి, జయరెడ్డి, జీఎం సందీప్, సేల్స్ మేనేజర్ వినీత్, నెట్వర్క్ మేనేజర్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.