అక్షరటుడే, కామారెడ్డి: పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలని ఎస్పీ సింధు శర్మ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కామారెడ్డి సబ్ డివిజన్ పోలీసులతో నెలవారి క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, పెట్రోలింగ్ పెంచి నేరాలు నియంత్రించాలని పేర్కొన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించి ప్రశంసపత్రాలు అందజేశారు. సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ తిరుపతయ్య, సీఐలు చంద్రశేఖర్ రెడ్డి, రామన్, సంపత్ కుమార్, శ్రీనివాస్, ఎస్సైలు పాల్గొన్నారు.