అక్షరటుడే, హైదరాబాద్: ట్యాంక్‌ బండ్‌ బోటు ప్రమాదం విషయంలో అధికారులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఇప్పటివరకు నివేదిక ఇవ్వకపోవడాన్ని మంత్రి సీరియస్ గా తీసుకున్నారు. టూరిజం బోట్‌లో బాణసంచా ఎలా అనుమతిస్తారని అధికారులను మంత్రి జూపల్లి నిలదీశారు. ప్రమాద బాధితులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.