అక్షరటుడే, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలకు సర్కారు సన్నద్ధం అవుతోంది. బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ నివేదికలు త్వరలోనే ప్రభుత్వానికి అందనున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సర్కారు కసరత్తు చేస్తోంది.
రెండు విడతలా.. మూడా..!
ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. అధికారులు మూడు విడతల్లో నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది.
ఎన్నికల సిబ్బంది కొరత రాకుండా..
రాష్ట్రంలో 12,845 పంచాయతీలు, వాటిల్లో 1,13,328 వార్డులు ఉన్నాయి. గత పంచాయతీ ఎన్నికల్లో 1.50 లక్షల మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఈసారి కూడా సిబ్బంది కొరత రాకుండా ఉండాలంటే మూడు విడతల్లో నిర్వహించాల్సి ఉంటుంది.